ప్రాచీన భారతదేశంలో మహిళల పాలన – "దిద్దా" కాశ్మీర్ మహారాణి

 

ప్రాచీన భారతదేశంలో మహిళల స్వేచ్ఛా పాలన – దిద్దా మహారాణి కాశ్మీర్ – పదవ శతాబ్దానికి ముందున్న చారిత్రక సత్యం మన ఈ పోస్టు ఉద్దేశం ఒక్కటే. మొగల్స్ రాకముందే, ఇస్లామిక్ పరిపాలనకు చాలా ముందే, భారతదేశంలో మహిళలు పురుషులతో సమానంగా రాజ్యాధికారాన్ని చేపట్టి పాలించిన చరిత్ర ఉందని శాసనాలు, సమకాలీన గ్రంథాల ఆధారాలతో ప్రజలకు తెలియజేయడం. ఈ ఉద్దేశానికి ఉత్తర భారతదేశంలో అత్యంత బలమైన ఉదాహరణ కాశ్మీర్‌కు చెందిన దిద్దా మహారాణి. కాశ్మీర్ రాజకీయ నేపథ్యం దిద్దా జీవించిన కాలం నాటి కాశ్మీర్ఒ క బలమైన రాజ్యవ్యవస్థ కలిగిన ప్రాంతం. అక్కడ రాజ్యాధికారం వారసత్వంగా కాకుండా సామర్థ్యం, రాజకీయ చతురత ఆధారంగా కొనసాగేది.

దిద్దా మహారాణి ఎవరు? దిద్దా మహారాణి లోహర వంశానికి చెందిన రాజకుమార్తె. ఆమె వివాహం కాశ్మీర్ రాజు క్షేమగుప్తుడితో జరిగింది.

కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. దిద్దా కేవలం “తల్లి”గా రాజ్యాన్ని చూసిన మహిళ కాదు. ఆమె స్వయంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంది. సైన్యాన్ని నియంత్రించింది. రాజ్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. స్వతంత్ర మహిళా పాలకురాలిగా దిద్దా

ఇది చాలా ముఖ్యమైన అంశం..ఎందుకంటే ఆ కాలంలో ఒక మహిళ పురుష వారసులు లేకున్నా రాజ్యాన్ని పాలించడం అత్యంత అరుదైన విషయం. కానీ దిద్దా ఆ సంప్రదాయాలను తలకిందులు చేసింది. ఆమె తానే రాజు..తానే నిర్ణయాధికారి..తానే సైనికాధిపతి. రాజకీయ ధైర్యం మరియు పరిపాలన

కానీ ఆమె ఈ తిరుగుబాట్లను దృఢంగా అణచివేసింది. సైన్యంపై ఆమెకు సంపూర్ణ నియంత్రణ ఉంది. రాజ్యాన్ని అస్థిరతలోకి వెళ్లనీయలేదు. ఇది ఒక స్పష్టమైన విషయాన్ని చెబుతుంది. దిద్దా మహారాణి పురుషుల నీడలో ఉన్న పాలకురాలు కాదు..ఆమె స్వతంత్ర రాజకీయ శక్తి. శారీరక వైకల్యం గురించి చరిత్ర ఏమి చెబుతోంది? సమకాలీన కాశ్మీర్ చరిత్ర గ్రంథమైన రాజతరంగిణి ప్రకారం, దిద్దా మహారాణికి చిన్ననాటినుంచి కాలి సంబంధిత శారీరక వైకల్యం ఉండేది. చరిత్రకారుడు కల్హణుడు ఆమెను నడవడంలో ఇబ్బంది ఉన్న మహిళగా వర్ణించాడు. కొన్ని వర్ణనలలో ఆమెను కదలికల కోసం సహాయం అవసరమయ్యే స్థితిలో ఉన్నట్టు చెబుతారు. కానీ ఈ శారీరక వైకల్యం ఆమె రాజకీయ సామర్థ్యాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. ఇది చాలా కీలకమైన విషయం. ప్రాచీన భారతదేశంలో మహిళలను మాత్రమే కాదు

దిద్దా మహారాణి జీవితం శారీరక పరిమితులు రాజకీయ శక్తికి అడ్డంకి కావు అన్నదానికి చారిత్రక సాక్ష్యం. ప్రాచీన వస్త్ర సంస్కృతి – కాశ్మీర్ మహిళలు

మహిళల వస్త్రధారణ పై వస్త్రం కింది వస్త్రం అనే సహజ విధానంలో ఉండేది. వస్త్రాలు శరీరాన్ని బందించడానికి కాదు సమాజాన్ని నియంత్రించడానికి కాదు సహజ జీవనానికి అనుగుణంగా ఉండేవి. ఇది కాశ్మీర్ మాత్రమే కాదు. అది అప్పటి భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. దిద్దా కథ మనకు చెప్పేది ఏమిటి? దిద్దా మహారాణి ఒక పురాణ పాత్ర కాదు. ఒక కల్పిత కథ కాదు. ఆమె జీవితం ఒక చారిత్రక సాక్ష్యం. మొగల్స్ రాకముందే బ్రాహ్మణీయ కట్టుబాట్లు పూర్తిగా ఆధిపత్యం సాధించకముందే భారతదేశంలో మహిళలు రాజ్యాధికారాన్ని స్వయంగా చేపట్టారు. చారిత్రక ఆధారాలు మరియు గ్రంథ సూచనలు కాశ్మీర్ చరిత్రకు అత్యంత ముఖ్యమైన ఆధారం రాజతరంగిణి..ఈ గ్రంథంలో దిద్దా మహారాణి పాలన వివరంగా నమోదు చేయబడింది. అదనపు అకాడమిక్ ఆధారాలు

R. S. Sharma – Early Medieval Indian Society D. C. Sircar – Select Inscriptions of Ancient India దిద్దా మహారాణి శారీరక వైకల్యం ఉన్నా రాజకీయంగా అత్యంత శక్తివంతమైన మహిళగా రాజ్యాన్ని పాలించిన ఉత్తర భారతదేశపు అత్యంత బలమైన చారిత్రక సాక్ష్యం. ఇదే మనం ప్రజలకు చెప్పాల్సిన నిజమైన ప్రాచీన భారతదేశ చరిత్ర.


No comments:

Post a Comment