జీవితం నిరంతర అధ్యయనం.. క్షణానికో అనుభవం ఎదురైనా, దాన్ని పాఠంగా మలుచుకొని ముందుకు సాగినవారే విజయం సాధిస్తారు...అయితే అనుకోకుండా కూడా కాలం కలసి వచ్చి కొందరు ఊహలకందని జీవితం అనుభవిస్తుంటారు. మనమెందుకు అలా లేమని ప్రశ్నించుకున్న వాళ్లందరూ విజయం సాధించాలని కూడా ఏమీ లేదు. కాని జీవితాన్ని నిరంతరం కాచి వడబోసుకుంటూ వెళ్లడం మాత్రం అందరికీ అవసరం. ఇదే జీవితం... కొత్త ఏడాది అంటే ఎంతో దూరం కాదు... క్షణం మారితే వచ్చేదే...కాని నువ్వు మారకు. ఆ భ్రమలో బతకకు. తెచ్చిపెట్టుకునే ఆలోచన ఎంతో కాలం నిలవదు... మనసులో నాటుకుపోయిన ఆలోచన నిన్ను వదిలిపోదు...
#viralvideo #viralkavitha #motivationkavitha
Please Share This Information to Your Friends with below icons. Thank You...
↙ ↓ ↘
No comments:
Post a Comment