తెలుగు వెలుగే.. కాని...

 తెలుగు వెలుగే.. కాని...

అవును తెలుగు వెలుగే ఈ మాటలంటున్న వారు ఎంత మంది నాయకులు, మేధావులు, సంస్కర్తలు తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివిస్తున్నారు, సర్కారు బడికి తోలుతున్నారో చూడా చెప్పాలి కదా! సంపన్న వర్గాలకు అందుతున్న ఆంగ్ల విద్య పేదల ఇంట్లో కనిపించొద్దా! ముందు ఇంగ్లీషు మీడియం చదువుతున్న తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్చి మాట్లాడితే ఆ మాటకో గౌరవం ఆపాదించబడుతుంది. అంతేగాని తెలుగు కోసం ఎనలేని సేవ చేస్తున్నట్లు మాట్లాడి కూడా ప్రచార కక్కుర్తికి దిగజారుతున్నారు...ఎంత మంది మేదావులు తెలుగులో తమ రచనా వ్యాసంగాలు రాసి, అచ్చు వేయడానికి చేతిలో అణాలేక, తెలుగు ప్రోత్సాహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు రూపాయి ఇవ్వక ఎంతో మంది రచయితల, రచనలు చెదలు పడుతున్నాయో తెలుసా....నేనో ...పుస్తకం రాశానని ప్రభుత్వ సాయం అందుతుందని ఆశగా వెల్లే వారికి కుర్చీలో కూర్చొని అక్షరం విలువ తెలియని వాళ్లు, అచ్చేస్తే ఎవరు చదువుతున్నారండీ.. డబ్బులు దండగ... అని మొహం మాటలు వింటున్న వారెంత మంది పండితులు వున్నారో తెలుసా... తెలుగును ఎవరో కాపాడితే ఆగేది కాదు, లేకుంటే...అంతరించేది కాదు...తెలుగన్నది నిరంతర ప్రవాహం... దానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేదు...తెలుగు సాహిత్యం అమ్మలాంటిది...అది ఎప్పుడూ ఇంట్లో వుంటుంది... ఆంగ్లం బయటి బాష అది బైటే వుంటుంది... కాని బువ్వ పెడుతోంది... గండపెండేరం తొడిగించుకున్న శ్రీనాధుడు కూడా తన సాహిత్యం కూడు పెట్టక వలస వెళ్లాడు...కూలి చేశాడు...అక్షరమే మూలం... కాని బతికుంటేనే కదా.. దానికంత గౌరవం..



#viralthing #viralkavitha #motivationkavitha #gampa #bestkavitha

Please Share This Information to Your Friends with below icons. Thank You...

                ↓  

No comments:

Post a Comment