జగన్ ముందస్తు యోచన?


 జగన్ ముందస్తు యోచన?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రయత్నాలు చేస్తున్నారా....అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు అందుకు ఊతమిచ్చేలా వున్నాయనే అంటున్నారు. ముఖ్యంగా అధికారుల బదిలీలు అందుకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే కరోనా ప్రభావం ఎదురైంది. దాంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా కుదేలయ్యాయి. అయినా ఎక్కడా  సంక్షేమ పథకాలకు అవాంతరాలు రాలేదు. మరింతగా సరికొత్త పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల మన్ననలు పొందుతూవచ్చారు. అయితే ఇటీవల కాలంలో కొంత రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగుల సమ్మెలాంటివి దీర్ఘకాలిక సమస్యలుగా మారకుండా చేసుకోవాలంటే ముందస్తు మంత్రమే ఉత్తమమైందన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇప్పటి మంత్రి వర్గానికి రెండేళ్ల అవకాశం అన్న హెచ్చరికలు జగన్ చేశారు. కాకపోతే రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ ఒడిదొడుకుల నేపథ్యంలో మంత్రులను కదిలించడం సమస్యగా మారే అవకాశం కూడా ఎదురుకావొచ్చు. అందుకే ముందస్తుకు వెళ్ళి గెలిచి, కొత్త టీంతో సరికొత్త పాలన, తిరుగులేని నాయకత్వం తనదే అని నిరూపించుకోవాలని చూస్తున్నారట. ఇంతలో కేంద్రం ఏదైనా నిర్ణయం ప్రకటించినా అది రాజకీయంగా ఉపయోగపడే అవకాశాలు కూడా వుంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో....


-మీ ప్రియ జర్నలిష్టు

K. మధుకర్ 


ఈ విషయం మీ వాట్సప్ గ్రూప్ లో షేర్ చేయండి 


No comments:

Post a Comment

Search This Blog